Tuesday, September 27, 2011

దూకుడు

నటీనటులు: మహేష్‌, సమంత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్‌, షాయాజీ షిండే, నాజర్‌, సంజయ్‌ స్వరూప్‌, ఎం.ఎస్‌.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, సుబ్బ రాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్‌, మాస్టర్‌ భరత్‌, సోనియా, సుప్రీత్‌, షఫి, ఆదిత్య మీనన్‌, ఇజాజ్‌ ఖాన్‌, వినోద్‌ జేవంత్‌, భరత్‌, సుధ, ప్రగతి, సత్యకృష్ణ, సురేఖవాణి, రజిత, వినయ్‌ ప్రసాద్‌, బేబి శ్రేయావర్మ, సెంథిల్‌, గిరిధర్‌, ప్రభాకర్‌, శ్రావణ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

సంగీతం: థమన్‌ ఎస్‌., కె.వి.గుహన్‌, 
మాటలు: గోపిమోహన్‌, కోన వెంకట్‌, కోటి పరుచూరి, ఎ.ఎస్‌.ప్రకాష్‌, విజయ్‌, ఎం.ఆర్‌.వర్మ,
పాటలు: రామ జోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, విశ్వ, సూర్య, సాయికిషోర్‌ మచ్చా సాంకేతివర్గం. 
సమర్పణ: రమేష్‌బాబు, 
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, 
థ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: శ్రీను వైట్ల

పాయింట్‌: తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకున్న ప్రతీకారం




ఎండలు మెండుగా ఉండాలి. వానలు పుష్కలంగా కురవాలి. చలి చక్కగా వీయాలి. వెన్నెల ఆహ్లాదాన్నివ్వాలి. ఇవన్నీ ప్రకృతి నియమాలు. ఇలా ప్రతి దానికీ నియమం పిక్స్‌ అయిపోతూ ఉంటుంది. సినిమాకూ ఆ నియమం ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఏవేం చేయాలో అదే చేయాలనే తపన దర్శకుడిలో కనిపించాలి. ఆ కోవలోనేది శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’. మహేస్‌బాబు చిత్రం ఇలానే ఉండాలి అని ఫిక్స్‌ అయిన ప్రేక్షకులకు ఆ ట్రాక్‌నుంచి వెళ్లిపోకుండా జాగ్రత్తగా డీల్‌చేస్తే ‘పోకిరి’ వంటి కాన్సెప్ట్‌నుకూడా మరోలా ఎలా తీయవచ్చో చూపించాడు. 

కథ 90వ దశకంలో ప్రారంభమవుతంది. శంకరనారాయణ (ప్రకాష్‌రాజ్‌)కు హైదరాబాద్‌లోని శంకరపుర ప్రజలకు తోడునీడ. ప్రజల కోసం ఏమైనా చేస్తాడు. అతని తమ్ముడు సత్యం (రాజీవ్‌కనకాల). అజయ్‌కుమార్‌ (మహేష్‌) కొడుకు. చిన్నతనం నుంచి దూకుడు ఎక్కువ. మంచి పనికోసం ఏదీ లెక్కచేయకపోవడమే దూకుడుని తండ్రి చెప్పిన అర్థాన్ని ఫాలోఅవుతాడు. 

శంకర్‌నారాయణకు షిండేతోపాటు కొంతమంది అనుచరగణం. ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచే స్టామినా ఉన్నవాడు. ఎన్‌.టి.ఆర్‌. రాజకీయాల్లో వచ్చాకకూడా స్వతంత్ర్యంగా పోటీచేసి గెలిచి పార్టీలోకి రమ్మన్నా... రాజకీయాలకు దూరంగా ప్రజా సేవచేసేవాడు. అదే ప్రాంతంలో దొంగ వ్యాపారాలు, దంతాలు చేసే మల్లేష్‌ (కోటశ్రీనివాసరావు) శంకరనారాయణ ఎదుగుదలను సహించలేడు. 

ముంబైలో దొంగ వ్యాపారాలుచేసే మాఫియా నాయక్‌ (సోసూసూద్‌)కు నమ్మకస్తుడు. శంకర్‌నారాయణ ఊరు వెళుతుంటే మల్లేష్‌, నాయక్‌ గ్రూప్‌ ఏక్సిడెంట్‌ చేస్తుంది. సత్యంను చంపేస్తుంది. శంకర్‌ నారాయణకూడా చనిపోయాడని శిలావిగ్రహం ఏర్పాటుచేస్తారు. 
ఆ తర్వాత ఇప్పటి దశకంలోకి కథ వస్తుంది. నాయక్‌ మాఫియా సామ్రాజ్యం విస్తరిస్తుంది. 

అతన్ని పట్టుకోవడానికి ఇండియన్‌ పోలీసు టార్గెట్‌ పెడుతుంది. ఆ పనిని అజయ్‌ (మహేష్)కు అప్పగిస్తుంది. తనో పోలీసు అధికారి. తన బృందంతో కలిసి వారి ఆటకట్టించాలంటే నాయక్‌ బలహీనతల్ని దెబ్బతీస్తాడు. అందులో భాగంగా ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. కానీ. చంపేది శంకర్‌నారాయణ. 

తనకు తెలీయకుండా తన తండ్రితో తన తండ్రికి అన్యాయం చేసిన వారినందరినీ అజయ్‌ చంపేస్తుంటాడు. మరోవైపు ప్రశాంతి (సమంత) ప్రేమలో అజయ్‌ పడతాడు. తన కొడుక్కి దగ్గరుండి పెండ్లికూడా చేస్తాడు శంకర్‌నారాయణ. ఇది తెలిసిన నాయక్‌, శంకర్‌ చనిపోలేదని తెలిసి ఉగ్రుడై దాన్ని నిజం చేయాలని పగతో వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి బతికున్నా చనిపోయినట్లు ఎందుకు అజయ్‌ అందరినీ నమ్మించాడు? అనేవి మిగిలిన సినిమా.

దర్శకుడు శ్రీనువైట్లకు తను రాసుకున్న కథతోపాటు మహేష్‌బాబుపైనా చాలా నమ్మకం ఉంచారు. అందుకే ప్రతి ఫ్రేములోనూ మహేష్ కన్పిస్తాడు. అలవాటు ప్రకారం రొమాంటిక్‌గా, యాక్షన్‌ హీరోగా పాత్ర కొలతల ప్రకారం చేసుకుపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోశాడు. రొమాన్స్‌, యాక్షన్‌, వినోదం.. ఇలా అతని మార్క్‌ (పోకిరి) కన్పిస్తుంది. 

అయినా దాన్ని కొత్తగా చూపించడంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రధానంగా బ్రహ్మానందం పాత్ర. రియాల్టీషో పేరుతో అతన్ని మోసం చేసే విధానం, నటుడిగా ఎం.ఎస్‌.పడే తపన ప్రేక్షకుల్ని మెప్పించాయి. సమంత పాత్ర పరిమితమే. అయినా కథాపరంగా సాగిపోతుంది. పాటల్లో అందాల్ని చూపించకుండా నటించింది.

మేకవన్నెపులిపాత్రలకు కొట్టినపిండి కోటశ్రీనివాసరావు, సమకాలీన రాజకీయనాయకుడిగా షిండే, మాఫియా నాయకుడిగా సోనూసూద్‌, కూల్‌.. కూల్‌.. అంటూ ఎటువంటి సన్నివేశంలోనైనా కూల్‌గా డైలాగ్‌లు చెప్పే ధర్మవరపు.. సిన్సియర్‌ ఆఫీసర్‌గా నాజర్‌, నాగబాబు.. ఇలా అందరూ ఈ సినిమాలో మేమూ ఉన్నాం అనిపించారు.

బాణీలపరంగా తమన్‌ రొటీన్‌ సంగీతంలా అనిపించినా పిక్చరైజేషన్‌లో మూడు పాటలు బాగున్నాయి. ‘రోబో’ కిలినాజరో..అనే తరహా పాట ఇందులోనూ పెట్టారు. సినిమా నిడివి 2.30నిము.. ఇందులో పాటలు ట్రిమ్‌చేస్తే బాగుంటుంది. సంభాషణలపరంగా గోపీమోహన్‌ పర్వాలేదనిపించారు. 

కథగా చెప్పాలంటే.. కాస్త లెంగ్త్ ఎక్కువగా, కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాట్లు అనిపించినా దాన్ని నడిపించడంలో బోర్‌లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌లో శ్రీనువైట్ల తీసుకున్న జాగ్రత్త ప్లస్‌ అయింది. చాలాకాలం తర్వాత మహేస్‌బాబు చిత్రం ఎలా ఉంటుందా? అన్న అభిమానులకు ఈ చిత్రం స్వీట్‌లాంటిది.

Wednesday, September 7, 2011

'1947 ఎ లవ్‌ స్టోరీ

పాయింట్‌: బ్రిటీష్‌పాలనలో మదరాసు పట్టణంలో 1947లో జరిగిన ప్రేమకథ.

ఆర్య, రియా జాక్సన్‌ జంటగా నటించిన 'మదరాసు పట్టణం' తమిళనాడులో విజయాన్ని సాధించింది. 20 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. విజయ్‌ దర్శకునిగా తొలిచిత్రం. తెలుగులో ఈ చిత్రాన్ని మల్టీ డైమన్షన్‌ సంస్థ '1947 ఎ లవ్‌ స్టోరీ' పేరుతో విడుదల చేసింది.

లవ్‌స్టోరీలు రొటీన్‌‌గా వస్తున్న తెలుగు ప్రేక్షకులు ఇది తీయటి జ్ఞాపకాన్ని ఇస్తుంది. స్క్రీన్‌ప్లేలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యేట్లు చేశాడు. ప్రతి పాత్రా నిజంగా జరుగుతున్నట్లుంటుంది. ఎక్కడా కల్పితం కన్పించదు. కథలో పట్టు, ఎడిటింగ్‌, ఫొటోగ్రఫీ, సంగీతం అన్నీ సమకూరడంతోపాటు కేవలం చూపుల్తోనే భావాల్ని వ్యక్తం చేసే పాత్రల్లో అందరూ నటించారు. ముఖ్యంగా బ్రిటీష్‌ దొరసానిగా రియా జాక్సన్‌ అమరింది. వృద్ధాప్యంలో ఆమె కన్నులతోనే హావభావాలు పలికించి మెప్పించింది.

కథగా చెప్పాలంటే.. బ్రిటీష్‌ దొరల కాలంలో మదరాసు పట్టణంలో ప్రజలు వారికి బానిసలుగా బతికేవారు. అందులో రజకులు ముఖ్యులు. వారుండే కాలనీలో నాజర్‌ కొంతమందిని ముష్టియుద్ధాలకు తర్ఫీదు ఇస్తుంటాడు. అందులో ఆర్య ఒకడు. కల్లాకపటం లేని మనుషులు. దొరల దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వడం వారి వ్యాపకం. హాయిగా సాగుతున్న వారిజీవితంలో 47లో వచ్చిన మదరాసు గవర్నర్‌ గోల్ఫ్‌కు స్థలాన్ని వెతుకుతుంటాడు.

అక్కడి ఆఫీసర్‌ మదరాసు రైల్వేస్టేషన్‌కు సమీపంలో గల రజకుల ప్రాంతాన్ని ఎంపిక చేస్తాడు. అందుకోసం వారిని ఖాళీ చేయమంటాడు. వినకపోతే క్రూరంగా శిక్షిస్తాడు. గవర్నర్‌ కుమార్తె రియాజాక్సన్‌ ఊరిని చూడటానికి గైడ్‌గా ఆర్యను పెట్టుకుంటుంది. అలా వారు నివశించే ప్రాంతానికి వచ్చి వారి బాధలు తెలుసుకుంటుంది. గోల్ఫ్‌ కోసం వారి జీవితాలను నాశనం చేయాలనునే అధికారికి బుధ్ధి చెబుతుంది. అయితే ఆ అధికారే రియాను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు.

ఓ సందర్భంలో ముష్టియుద్ధానికి దిగి అధికారి ఆర్య చేతిలో ఓడిపోతాడు. దాంతో సమస్య తీరుతుంది. కానీ రియా ఆర్యను ప్రేమిస్తుంది. అది తెలిసిన గవర్నర్‌ ఆర్యను శిక్షించే బాధ్యతను అధికారికి అప్పగిస్తాడు. అదే టైమ్‌లో 47 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్య్రం ఇస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటిస్తాడు. ఇక స్వాతంత్రం వస్తే తాము ఇక్కడ ఉండకూడదని కుమార్తెను తీసుకుని గవర్నర్‌ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ రియా ఆర్యపై ప్రేమతో వారినుంచి తప్పించుకుని ఆర్యను కలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా

Monday, September 5, 2011

కెరటం

నటీనటులు: సిద్దార్థ రాజ్‌కుమార్‌, ఐశ్వర్య, కవిత, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, భీమినేని శ్రీనివాసరావు, సుమన్‌, వేణుమాధవ్‌, ప్రదీప్‌, శిల్ప తదితరులు.
నిర్మాత: ఎస్‌.వి. బాబు, దర్శకత్వం: గౌతమ్‌ పట్నాయక్‌.


పాయింట్‌: యుక్తవయస్సులో కెరటంలా వచ్చే లవ్‌ కన్నా కెరీర్‌వైపు దాన్ని మళ్ళించమని చెప్పే కథ.

హ్యాపీగా కాలేజీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేయడమే కాదు కెరీర్‌ను కూడా చూసుకుంటే ఎలా ఉంటుందనేది హ్యాపీడేస్‌ చిత్రం. అంత హ్యాపీగా కాలేజీలైఫ్‌ అనుభవిస్తూ... తన తోటివారంతా కెరీర్‌వైపు సాగితే తను మాత్రం లవ్‌ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగితే ఏమవుతుందనేది 'కెరటం'. కన్నడ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఎక్కువ భాగం కన్నడ నటీనటులే నటించారీ చిత్రంలో.

కథలోకి వెళితే...
సిద్దు (సిద్దార్థ రాజ్‌కుమార్‌) చలాకీ కుర్రాడు. కాలేజీ జీవితమంటే హాయిగా గడపటమే అనుకొంటాడు. అక్కడే చదివే ఏడుగురు స్నేహితులు. అందులో గీత (ఐశ్వర్య)తో స్నేహం ప్రేమాగా మారుతుంది. సరదా సాగే సిద్దు జీవితంలో ఆ కాలేజీలో చదివే రోబో చిచ్చు రేపుతాడు. గీత కావాలంటే బైక్‌ రేసులో పాల్గొనాలనేది రూల్‌. అలా పాల్గొని గెలుస్తాడు. దాన్ని అవమానంగా భావించి గీతను రోబో కెమిస్ట్రీ ల్యాబ్‌లో రేప్‌ చేయబోతాడు. ఇది తెలిసి సిద్దు ఆమెను రక్షిస్తాడు.

ఆ గొడవలో కరెంట్‌షాక్‌ తగిలి రోబో ఆసుపత్రిపాలవుతాడు. ఈ గొడవతో పోలీసులు రంగప్రవేశం చేస్తారు. దీంతో వారి తల్లిదండ్రులంతా సిద్దుకు దూరంగా పిల్లల్ని పెంచుతారు. తమకు కెరీర్‌ ముఖ్యమని అందుకే నీకు దూరంగా ఉంటున్నామని చెప్పినా సిద్దు లెక్కచేయడు. తను ప్రేమించిన గీత కూడా దూరమవుతుంది.

అయితే అదే సమయంలో ఆ కాలనీకి కొత్తగా వచ్చిన సంగీత(రకుల్‌ప్రీత్‌సింగ్‌)ను ప్రేమించేస్తాడు. ఇదే విషయాన్ని చెబితే... ఛీ కొడుతుంది. తనకంటూ పెద్ద డాక్టర్‌ అవ్వాలనే గోల్‌ ఉందని.. నీకేముందని అసహ్యించుకుంటుంది. మరోవైపు సిద్దు తండ్రి రిటైర్‌ అవుతాడు. ఆసరాగా వస్తాడనుకున్న కొడుకు అందిరాకపోవడంతో చేసేది లేక ఇంటి నుంచి గెంటేస్తారు. అదే టైమ్‌లో సిద్దు స్నేహితులు ఒక్కొక్కరు జీవితంలో ఎదిగి అదే కాలేజీలో సన్మానం చేయించుకుంటారు. ఇది తెలిసిన సిద్ధు ఏం చేశాడు? అనేది సినిమా.

కేవలం మంచి సందేశం ఇవ్వాలన్న తాపత్రయంలో దర్శకుడు, నిర్మాతలు సన్నివేశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కన్పించలేదు. అమ్మాయిని రేప్‌ చేసి చంపేయాలనుకున్న రోబో వంటి వ్యక్తి గురించి పోలీసుల ముందు సిద్దు స్నేహితులు కూడా చెప్పకపోవడం.. కేవలం రోబోను కావాలనే కొట్టినట్లుగా చెప్పించడం విడ్డూరంగా ఉంది. పతాక సన్నివేశంలో సిద్దు తల్లిదండ్రులు ఎందుకు కాలేజీకి వెళ్లారో స్పష్టత లేదు. తొలి భాగం కాలేజీ సన్నివేశాలు హ్యాపీడేస్‌ను గుర్తుకు తెస్తాయి.

వంశపారంపర్య నటుల్లో కృష్ణంరాజు వారసునిగా వచ్చిన సిద్దార్థ్‌ రాజ్‌కుమార్‌ డాన్స్‌లు బాగానే చేశాడు. ఐశ్వర్య ఫేస్‌లో హావభావాలు పెద్దగా కన్పించవు. సగటుజీవి గుమాస్తాగా భీమినేని శ్రీనివాసరావు బాగానే చేశాడు. సుమన్‌, కవిత పాత్రలు మినహా మిగిలినవారంతా కన్నడ నటీనటులే. జోస్వీ శ్రీధర్‌ సంగీతం గొప్పగా లేకపోయినా వినడానికి బాగున్నాయి.

యువతపై చిత్రాలు తీయాలనుకున్నప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి. వారంతా పబ్‌లు, ప్రేమలు అంటూ కాన్సెప్ట్‌లు చూపించి చివరికి ఒక సంఘటనతో మారిపోయేట్లు చూపించే చిత్రాలు చాలానే వచ్చాయి. ప్రధానంగా.. పిల్లల కెరీర్‌ను జాగ్రత్తగా పరిశీలించడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతైనా ఉందని చెప్పే చిత్రమిది. ఈ సందేశం బాగున్నా... కథనం మరింత ఆసక్తి గొలిపేది ఉంటే మరింతగా ఆకట్టుకునేది.

Friday, September 2, 2011

Naaku O Lover Undi Movie Review

Naaku O Lover Undi Review – Naaku O Lover Undi Telugu Movie Review, Rating: Krishnudu, who is yet to bag his second hit after hitting bull’s eye with his debut film Vinayakudu has come up with Naaku O Lover Undi film. This film is directed by Ram Venky on Sri Siva Parvathi Combines banner. K. Suresh Babu is the producer of this film in which Rithika played the female lead.

Listen Review:

Story:

Krishna Sasthry (Krishnudu) is a Brahmin guy who leads his life as per the wish of his orthodox father. Krishna wants to lead life like a common youth who wears modern dresses and all. There enters Neelima (Rithika) into Krishna’s life. He goes for a makeover to impress her but realizes that she is in love with an unknown person who saved her from big danger. That person is none other than Krishna but he hesitates to tell that to her as he doesn’t want her love out of gratitude.

Analysis:

N.O.L.U is a routine fare which doesn’t have a hint of variety or freshness in it. Director tried to pull out a successful comedy using Krishnudu’s big frame. He didn’t have a solid script on hands. First half of the film is passable but the second half is a complete let down. There are so many noted artists in the film but none leaves a mark.

Performances:

Krishnudu failed as an actor again. He is not improving his acting skills even after starring in so many films. Rithika doesn’t impress. Her performance is very bad. MS Narayana excelled here and there. Ali and Venu Madhav are wasted. Producer Suresh Babu himself played the villain role. Rest of the star cast did what they are asked to do.

Technicalities:

Raghava’s script is pretty weak. He tried to recreate few successful comedy scenes in this film which didn’t click. Most of the times the writing reminds you of TV serials. Radhakrishna’s music is on the negative side too. Sad to see a music director who looked promising at the start of his career. Camera and editing are good for a low budget film. Director Ram Venky did well to get the right star cast but failed to choose a proper script to succeed.

Final Word: Wait for the home edition of Naaku O Lover Undi. No need to rush to the theatres.

Naaku O Lover Undi Movie Rating: 2.25/5

Banner: Sri Shiva Parvati Combines
Cast: Krishnudu, Rithika
Music Director: K.M. Radha Krishnan
Producer: K Suresh Babu
Director: K Ram Venki