పాయింట్: బ్రిటీష్‌పాలనలో మదరాసు పట్టణంలో 1947లో జరిగిన ప్రేమకథ.
ఆర్య, రియా జాక్సన్ జంటగా నటించిన 'మదరాసు పట్టణం' తమిళనాడులో విజయాన్ని సాధించింది. 20 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. విజయ్ దర్శకునిగా తొలిచిత్రం. తెలుగులో ఈ చిత్రాన్ని మల్టీ డైమన్షన్ సంస్థ '1947 ఎ లవ్ స్టోరీ' పేరుతో విడుదల చేసింది.
లవ్‌స్టోరీలు రొటీన్‌గా వస్తున్న తెలుగు ప్రేక్షకులు ఇది తీయటి జ్ఞాపకాన్ని ఇస్తుంది. స్క్రీన్‌ప్లేలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు కథలో ఇన్‌వాల్వ్ అయ్యేట్లు చేశాడు. ప్రతి పాత్రా నిజంగా జరుగుతున్నట్లుంటుంది. ఎక్కడా కల్పితం కన్పించదు. కథలో పట్టు, ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, సంగీతం అన్నీ సమకూరడంతోపాటు కేవలం చూపుల్తోనే భావాల్ని వ్యక్తం చేసే పాత్రల్లో అందరూ నటించారు. ముఖ్యంగా బ్రిటీష్ దొరసానిగా రియా జాక్సన్ అమరింది. వృద్ధాప్యంలో ఆమె కన్నులతోనే హావభావాలు పలికించి మెప్పించింది.
కథగా చెప్పాలంటే.. బ్రిటీష్ దొరల కాలంలో మదరాసు పట్టణంలో ప్రజలు వారికి బానిసలుగా బతికేవారు. అందులో రజకులు ముఖ్యులు. వారుండే కాలనీలో నాజర్ కొంతమందిని ముష్టియుద్ధాలకు తర్ఫీదు ఇస్తుంటాడు. అందులో ఆర్య ఒకడు. కల్లాకపటం లేని మనుషులు. దొరల దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వడం వారి వ్యాపకం. హాయిగా సాగుతున్న వారిజీవితంలో 47లో వచ్చిన మదరాసు గవర్నర్ గోల్ఫ్‌కు స్థలాన్ని వెతుకుతుంటాడు.
అక్కడి ఆఫీసర్ మదరాసు రైల్వేస్టేషన్‌కు సమీపంలో గల రజకుల ప్రాంతాన్ని ఎంపిక చేస్తాడు. అందుకోసం వారిని ఖాళీ చేయమంటాడు. వినకపోతే క్రూరంగా శిక్షిస్తాడు. గవర్నర్ కుమార్తె రియాజాక్సన్ ఊరిని చూడటానికి గైడ్‌గా ఆర్యను పెట్టుకుంటుంది. అలా వారు నివశించే ప్రాంతానికి వచ్చి వారి బాధలు తెలుసుకుంటుంది. గోల్ఫ్ కోసం వారి జీవితాలను నాశనం చేయాలనునే అధికారికి బుధ్ధి చెబుతుంది. అయితే ఆ అధికారే రియాను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు.
ఓ సందర్భంలో ముష్టియుద్ధానికి దిగి అధికారి ఆర్య చేతిలో ఓడిపోతాడు. దాంతో సమస్య తీరుతుంది. కానీ రియా ఆర్యను ప్రేమిస్తుంది. అది తెలిసిన గవర్నర్ ఆర్యను శిక్షించే బాధ్యతను అధికారికి అప్పగిస్తాడు. అదే టైమ్‌లో 47 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్య్రం ఇస్తున్నట్లు గవర్నర్ ప్రకటిస్తాడు. ఇక స్వాతంత్రం వస్తే తాము ఇక్కడ ఉండకూడదని కుమార్తెను తీసుకుని గవర్నర్ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ రియా ఆర్యపై ప్రేమతో వారినుంచి తప్పించుకుని ఆర్యను కలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా

No comments:
Post a Comment