Saturday, March 3, 2012

నితిన్‌కు సరిపడ ఇష్క్‌...!!



Ishq
WD
నితిన్‌, అలీ, నిత్యమీనన్‌, సుప్రీత్‌, సుధ, సంధ్యజనక్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు 
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: రమేష్‌, ఫైట్స్‌: విజయ్‌, రామ్‌లక్ష్మణ్‌, 
పాటలు: అనంతశ్రీరామ్‌, కృష్ణచైతన్య, కెమెరా: పి.సి. శ్రీరామ్‌, నిర్మాత: 
విక్రమ్‌గౌడ, సుధాకరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌. 

ఈనాటి యువత చేసేపనులు చాలా చిత్రంగా వుంటాయి. ఎంత అభిమానం గుండెల్లో పెట్టుకుంటారో, అంతకంటే ఎక్కువగా తింగరి పనులుచేసి ఆనందిస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్లను కూడా ఆటపట్టిస్తూ బయటవారి పట్ల ఆటపట్టిస్తూనే చిలిపిపనులు చేస్తుంటారు. ఈ అల్లరి చిల్లరి వ్యవహారాలు ప్రేయసితో కలగలిస్తే ఇష్క్‌.. ప్యార్‌.. మొహబత్‌ అవుతుంది. నితిన్‌ చాలా కాలం తర్వాత క్లాసికల్‌ లవ్‌స్టోరీ చేశాడు. పిసి శ్రీరామ్‌ కెమెరామెన్‌గా వ్యవహరించారు. ఈ చిత్రం శుక్రవారం 24.2.2012న విడుదలైంది. 

ఇక కథలోకి వెళ్తే.. ఢిల్లీలో కాలేజీ ఫైనల్‌ ఇయర్‌ చదివే రాహుల్‌ (నితిన్‌) అందరినీ ఆటపట్టిస్తుంటాడు. సెలవులకు హైదరాబాద్‌ వస్తున్న నితిన్‌కు ప్రియ (నిత్యమీనన్‌) ఎయిర్‌పోర్టులో పరిచయమవుతుంది. ఆమెను ఆటపట్టిస్తూ పరిచయ పెంచుకుంటాడు. హైదరాబాద్‌లో వర్షాలతో వాతావరణ అనుకూలంచకపోవడంతో గోవాలో హాల్ట్‌ అవుతుంది. 

అదేరోజు తన స్నేహితుడిని పెండ్లికి రాహుల్‌, ప్రియతో వెళతాడు. అక్కడ తన భార్యగా పరిచయం చేస్తాడు. దాన్ని నిజం చేస్తూ కొన్ని సంఘటనలు జరుగుతాయి. వారి మధ్య ప్రేమ పాకానపడుతుంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వచ్చేస్తారు. అక్కడ ప్రియ అన్నయ్య శివ (అజయ్‌)ను చూసి షాకవుతాడు. రాహుల్‌ అక్క దివ్య (సింధుతులాని)ని శివ ఒన్‌సైడ్‌ లవ్‌ చేస్తాడు. ససేమిరా అనడంతో శాడిస్టులా బిహేవ్‌ చేస్తాడు. దాంతో రాహుల్‌ దేహశుద్ది చేస్తాడు. 

శివ తండ్రి పోలీసు కమీషనర్‌ నాగినీడు. కొడుకు తన పలుకుబడిని అడ్డంపెట్టుకుని చేసే వెధవపనులకు సహించలేక... మూడేళ్లు దూరంగా వెళ్ళిపోతాడు. శివ వేరే పెండ్లిచేసుకుని హాయిగా జీవిస్తుంటాడు. శివకు ప్రియ అంటే ప్రాణం. తన చెల్లెల్ని ప్రేమించింది రాహుల్‌ అని తెలిసి సహించలేడు. వాడికి సేమ్‌గా దేహశుద్ధి చేస్తాడు. కానీ, రాహుల్‌ తన మైండ్‌గేమ్‌తో... ఆ ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అది ఎలా అనేది సినిమా. 

పరిమిత పాత్రలతో హీరోహీరోయిన్లు, అజయ్‌, వారి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ... సాగే కథ ఇది. కథకు సరిపడా నటీనటులున్నాయి. నితిన్‌ చాలాకాలం తర్వాత సరిపోయే పాత్ర వేశాడు. నిత్యమీనన్‌ అల్లరితనం, చిలిపితనంతో సాగే లవ్‌ట్రాక్‌ కాస్త స్లో నెరేషన్‌అయినా ఇంట్రస్ట్‌గా ఉంది. మొదటి భాగం కాస్త ఓపిగ్గా కూర్చోవాలి. సెకండాఫ్‌లో కథంతా సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు బాగుంటాయి. అయితే కథాగమనంలో దర్శకుడు తడపడ్డాడు. స్క్రీన్‌ప్లే లోపముంది. తర్వాతి సన్నివేశం ఇట్టే తెలిసిపోతుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తపడితే ఇంకా ఇంట్రస్ట్‌గా ఉంటుంది. 

కెమెరామెన్‌ పి.సి.శ్రీరామ్‌ పనితనం చెప్పక్కర్లేదు. 'లచ్చుమ్మ...' అనే పబ్‌సాంగ్‌ చిత్రానికి హైలైట్‌. కేవలం ఆ పాటలోనే తాగుబోతు రమేష్‌ కన్పిస్తాడు. మిగిలిన పాటలూ బాగానే వున్నాయి. టోటల్‌ఇది క్లాసికల్‌ లవ్‌స్టోరీ. ఇటువంటి చిత్రాల్లో ఇంకాస్త కామెడీ ఉంటే బాగుండేది. కేవలం హీరోహీరోయిన్లు ఈ లోటు తీర్చారు. హీరోయిన్‌ను టీజ్‌చేసే ట్రాక్‌ ఇంట్రస్ట్‌గా ఉంది. డైలాగ్స్‌ కూడా సింపుల్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో యాక్షన్‌ సన్నివేశం బాగుంది. యువతను మెచ్చే కథాంశంతో లవ్‌తోపాటు కుటుంబ విలువలు కూడా ఇందులో చూపించాడు. టేకింగ్‌లో మరింత జాగ్రత్త తీసుకుంటే బి,సి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.