Tuesday, September 27, 2011

దూకుడు

నటీనటులు: మహేష్‌, సమంత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్‌, షాయాజీ షిండే, నాజర్‌, సంజయ్‌ స్వరూప్‌, ఎం.ఎస్‌.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, సుబ్బ రాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్‌, మాస్టర్‌ భరత్‌, సోనియా, సుప్రీత్‌, షఫి, ఆదిత్య మీనన్‌, ఇజాజ్‌ ఖాన్‌, వినోద్‌ జేవంత్‌, భరత్‌, సుధ, ప్రగతి, సత్యకృష్ణ, సురేఖవాణి, రజిత, వినయ్‌ ప్రసాద్‌, బేబి శ్రేయావర్మ, సెంథిల్‌, గిరిధర్‌, ప్రభాకర్‌, శ్రావణ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

సంగీతం: థమన్‌ ఎస్‌., కె.వి.గుహన్‌, 
మాటలు: గోపిమోహన్‌, కోన వెంకట్‌, కోటి పరుచూరి, ఎ.ఎస్‌.ప్రకాష్‌, విజయ్‌, ఎం.ఆర్‌.వర్మ,
పాటలు: రామ జోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, విశ్వ, సూర్య, సాయికిషోర్‌ మచ్చా సాంకేతివర్గం. 
సమర్పణ: రమేష్‌బాబు, 
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, 
థ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: శ్రీను వైట్ల

పాయింట్‌: తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకున్న ప్రతీకారం




ఎండలు మెండుగా ఉండాలి. వానలు పుష్కలంగా కురవాలి. చలి చక్కగా వీయాలి. వెన్నెల ఆహ్లాదాన్నివ్వాలి. ఇవన్నీ ప్రకృతి నియమాలు. ఇలా ప్రతి దానికీ నియమం పిక్స్‌ అయిపోతూ ఉంటుంది. సినిమాకూ ఆ నియమం ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి ఏవేం చేయాలో అదే చేయాలనే తపన దర్శకుడిలో కనిపించాలి. ఆ కోవలోనేది శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’. మహేస్‌బాబు చిత్రం ఇలానే ఉండాలి అని ఫిక్స్‌ అయిన ప్రేక్షకులకు ఆ ట్రాక్‌నుంచి వెళ్లిపోకుండా జాగ్రత్తగా డీల్‌చేస్తే ‘పోకిరి’ వంటి కాన్సెప్ట్‌నుకూడా మరోలా ఎలా తీయవచ్చో చూపించాడు. 

కథ 90వ దశకంలో ప్రారంభమవుతంది. శంకరనారాయణ (ప్రకాష్‌రాజ్‌)కు హైదరాబాద్‌లోని శంకరపుర ప్రజలకు తోడునీడ. ప్రజల కోసం ఏమైనా చేస్తాడు. అతని తమ్ముడు సత్యం (రాజీవ్‌కనకాల). అజయ్‌కుమార్‌ (మహేష్‌) కొడుకు. చిన్నతనం నుంచి దూకుడు ఎక్కువ. మంచి పనికోసం ఏదీ లెక్కచేయకపోవడమే దూకుడుని తండ్రి చెప్పిన అర్థాన్ని ఫాలోఅవుతాడు. 

శంకర్‌నారాయణకు షిండేతోపాటు కొంతమంది అనుచరగణం. ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచే స్టామినా ఉన్నవాడు. ఎన్‌.టి.ఆర్‌. రాజకీయాల్లో వచ్చాకకూడా స్వతంత్ర్యంగా పోటీచేసి గెలిచి పార్టీలోకి రమ్మన్నా... రాజకీయాలకు దూరంగా ప్రజా సేవచేసేవాడు. అదే ప్రాంతంలో దొంగ వ్యాపారాలు, దంతాలు చేసే మల్లేష్‌ (కోటశ్రీనివాసరావు) శంకరనారాయణ ఎదుగుదలను సహించలేడు. 

ముంబైలో దొంగ వ్యాపారాలుచేసే మాఫియా నాయక్‌ (సోసూసూద్‌)కు నమ్మకస్తుడు. శంకర్‌నారాయణ ఊరు వెళుతుంటే మల్లేష్‌, నాయక్‌ గ్రూప్‌ ఏక్సిడెంట్‌ చేస్తుంది. సత్యంను చంపేస్తుంది. శంకర్‌ నారాయణకూడా చనిపోయాడని శిలావిగ్రహం ఏర్పాటుచేస్తారు. 
ఆ తర్వాత ఇప్పటి దశకంలోకి కథ వస్తుంది. నాయక్‌ మాఫియా సామ్రాజ్యం విస్తరిస్తుంది. 

అతన్ని పట్టుకోవడానికి ఇండియన్‌ పోలీసు టార్గెట్‌ పెడుతుంది. ఆ పనిని అజయ్‌ (మహేష్)కు అప్పగిస్తుంది. తనో పోలీసు అధికారి. తన బృందంతో కలిసి వారి ఆటకట్టించాలంటే నాయక్‌ బలహీనతల్ని దెబ్బతీస్తాడు. అందులో భాగంగా ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. కానీ. చంపేది శంకర్‌నారాయణ. 

తనకు తెలీయకుండా తన తండ్రితో తన తండ్రికి అన్యాయం చేసిన వారినందరినీ అజయ్‌ చంపేస్తుంటాడు. మరోవైపు ప్రశాంతి (సమంత) ప్రేమలో అజయ్‌ పడతాడు. తన కొడుక్కి దగ్గరుండి పెండ్లికూడా చేస్తాడు శంకర్‌నారాయణ. ఇది తెలిసిన నాయక్‌, శంకర్‌ చనిపోలేదని తెలిసి ఉగ్రుడై దాన్ని నిజం చేయాలని పగతో వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి బతికున్నా చనిపోయినట్లు ఎందుకు అజయ్‌ అందరినీ నమ్మించాడు? అనేవి మిగిలిన సినిమా.

దర్శకుడు శ్రీనువైట్లకు తను రాసుకున్న కథతోపాటు మహేష్‌బాబుపైనా చాలా నమ్మకం ఉంచారు. అందుకే ప్రతి ఫ్రేములోనూ మహేష్ కన్పిస్తాడు. అలవాటు ప్రకారం రొమాంటిక్‌గా, యాక్షన్‌ హీరోగా పాత్ర కొలతల ప్రకారం చేసుకుపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోశాడు. రొమాన్స్‌, యాక్షన్‌, వినోదం.. ఇలా అతని మార్క్‌ (పోకిరి) కన్పిస్తుంది. 

అయినా దాన్ని కొత్తగా చూపించడంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రధానంగా బ్రహ్మానందం పాత్ర. రియాల్టీషో పేరుతో అతన్ని మోసం చేసే విధానం, నటుడిగా ఎం.ఎస్‌.పడే తపన ప్రేక్షకుల్ని మెప్పించాయి. సమంత పాత్ర పరిమితమే. అయినా కథాపరంగా సాగిపోతుంది. పాటల్లో అందాల్ని చూపించకుండా నటించింది.

మేకవన్నెపులిపాత్రలకు కొట్టినపిండి కోటశ్రీనివాసరావు, సమకాలీన రాజకీయనాయకుడిగా షిండే, మాఫియా నాయకుడిగా సోనూసూద్‌, కూల్‌.. కూల్‌.. అంటూ ఎటువంటి సన్నివేశంలోనైనా కూల్‌గా డైలాగ్‌లు చెప్పే ధర్మవరపు.. సిన్సియర్‌ ఆఫీసర్‌గా నాజర్‌, నాగబాబు.. ఇలా అందరూ ఈ సినిమాలో మేమూ ఉన్నాం అనిపించారు.

బాణీలపరంగా తమన్‌ రొటీన్‌ సంగీతంలా అనిపించినా పిక్చరైజేషన్‌లో మూడు పాటలు బాగున్నాయి. ‘రోబో’ కిలినాజరో..అనే తరహా పాట ఇందులోనూ పెట్టారు. సినిమా నిడివి 2.30నిము.. ఇందులో పాటలు ట్రిమ్‌చేస్తే బాగుంటుంది. సంభాషణలపరంగా గోపీమోహన్‌ పర్వాలేదనిపించారు. 

కథగా చెప్పాలంటే.. కాస్త లెంగ్త్ ఎక్కువగా, కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాట్లు అనిపించినా దాన్ని నడిపించడంలో బోర్‌లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌లో శ్రీనువైట్ల తీసుకున్న జాగ్రత్త ప్లస్‌ అయింది. చాలాకాలం తర్వాత మహేస్‌బాబు చిత్రం ఎలా ఉంటుందా? అన్న అభిమానులకు ఈ చిత్రం స్వీట్‌లాంటిది.

No comments:

Post a Comment